సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : కర్ని : ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు చత్రపతి శివాజీ మహారాజ్ అని కర్ని గ్రామ శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. బహుజన చక్రవర్తి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారము మక్తల్ మండల పరిధిలోని కర్ని గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. జయంతి ఉత్సవాలకు గ్రామ పెద్దలు, యువకులు హాజరై గ్రామంలోని శివాజీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజి మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు మాట్లాడుతూ.. యువత చెడు మార్గంలో పయనించకుండా మహనీయుల ఆశయాలను, ఆలోచన విధానాలను అనుసరిస్తూ మంచి మార్గంలో వెళుతూ ప్రయోజకులు కావాలన్నారు. మహనీయుల జయంతిని మన గ్రామ యువకులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా యువత మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలన్నారు. అదేవిధంగా గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా యువత, గ్రామ పెద్దలు కృషి చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1869 లో శివాజీ సమాధిని కనుగొని,1870 లో మొట్టమొదటి సారిగా శివాజీ జయంతిని జరిపి ఆయన ఆశయ సాధనకోసం మనందరికి మార్గ దర్శనం చేశారన్నారు.పరమత సహనాన్ని ప్రదర్శిస్తూ తన పాలనలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించటంతో పాటు అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప లౌకికవాది శివాజీ మహరాజ్ అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి కుల్వాడి భూషణ్ గా పేరు గాంచిన గొప్ప మహనీయుడి ఆశయ సాధనలో మనమంతా ముందుకు వెళ్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రఘురాం, సద్ధమహుసేన్, ఎద్దుల హన్మంత్, వాకిటి హన్మంత్, కాట్రేవ్ పల్లి బాలప్ప, బీమెష్, కుమ్మరి తిప్పన్న, బిల్లి నరసింహ, పరశురాములు, కుంటిమారి అంజప్ప, పంది కృష్ణ, ఈద శివకుమార్, కుమ్మరి శ్రీను, కుమ్మరి నరసింహ, వాకిటి మొగులప్ప, కుర్వ తిప్పన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin