సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి కి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరిన శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ . పెనుకొండ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి , శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ సమక్షంలో పెనుకొండ పట్టణ మరియు మండలం, సోమందేపల్లి మండలం మరియు రొద్దం మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులతో కలిసి సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే శంకర నారాయణ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన వెన్నపూస రవీంద్రా రెడ్డి ని సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పెనుకొండ పట్టణ మరియు మండలం, సోమందేపల్లి మండలం మరియు రొద్దం మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరుల పాల్గొన్నారు.
-----------------------
Admin