సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : అంగన్వాడి టీచర్లు ఆయాలు నల్ల వస్త్రాలు ధరించి స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి దుబ్బ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూర్జాన్, ఈ .రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడి టీచర్స్ ఆయాల్లో సమస్యలు పరిశీలించాలని ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్టు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించినారు.అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని ,పిఎఫ్ ,ఈఎస్ ఈ అమలు చేయాలని అమలు జరిపాలని హెల్త్ స్కీంను ప్రకటించి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి పెన్షన్ సదుపాయం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్కు ఐదు లక్షల ఆయాలకు మూడు లక్షలుఇవ్వాలని ,10 సంవత్సరాల నుండి బకాయి ఉన్న డి ఏ డి ఏ లను చెల్లించాలని అధికారుల వేధింపులను నిరోధించాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు ,ప్రధాన కార్యదర్శి స్వర్ణ ,సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వై గంగాధర్, సిఐటియు నాయకులు కే. రాములు అంగన్వాడీ యూనియన్ నాయకులు చంద్రకళ, వాణి ,సూర్య కళ ,జ్యోతి ,గోదావరి, యమున ,లక్ష్మి తదితరులతో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు...
-----------------------
Admin