సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : సీతంపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి రాఘవపురం వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.శుక్రవారం సీతంపేట గ్రామంలో పర్యటించి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ సీతంపేట గ్రామం నుండి రాఘవపురం గ్రామానికి రోజు వందలాది మంది రైతులు,ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారని సరైన రహదారి లేకపోవడం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. సీతంపేట, రాఘవపురం గ్రామాలు ఏర్పడి ఆరవై ఏళ్ళు దాటినా నేటికీ రహదారి లేకపోవడం పాలకుల అసమర్ధతకు నిదర్శనమన్నారు. ప్రతీ నాయకుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం గెలిచాక మర్చిపోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సీతంపేట రాఘవపురం రహదారి మంజూరు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సాయి, జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ ఇంచార్జ్ నాగుల రవికుమార్, తడికమల్ల దిలీప్, తాళ్లూరి మోహస్ దాస్, తగరం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin