Sunday, 26 July 2026 01:33:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రమదోపడికి గురౌతున్న మైనింగ్, టెక్నికల్ సిబ్బంది...

Date : 10 September 2023 07:23 AM Views : 223

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఫ్రంట్లైన్ సూపర్వైజర్లకు దక్కని గౌరవం.. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన మైనింగ్, టెక్నికల్ సిబ్బందితో ఊడిగం చేయించుకుంటారా..? కార్మికులు రోడ్డెక్కే పరిస్థితికి తీసుకురాకండి. న్యాయమైన డిమాండ్ల పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదు వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, రాజకుమార్ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్ష... కొత్తగూడెం : బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక భూమిక పోషిస్తున్న మైనింగ్, టెక్నికల్ సిబ్బందిపట్ల సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, పేరుకే ఫ్రంటన్ సూపర్ వైజర్లుగా పేర్కొంటున్నారేతప్ప తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్, సిపిఐ భద్రాది జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ సింగరేణి మైనింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ సబ్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షల శిభిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సంస్థకు ఎనలేని సేవలందించి పురోభివృద్ధికి తోడ్పాటును అందించి అనారోగ్య కారణాలతో మెడికల్ ఆన్ఫెట్ అయిన మైనింగ్, టెక్నికల్ సిబ్బందికి సరైన గౌరవం దక్కడం లేదన్నారు. హోదా తగ్గకుండా సర్ఫేస్ ఉద్యోగం కల్పించాల్సిన భాద్యత యాజమాన్యంపై ఉందని, సర్ఫేస్ సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఏఐటియుసి గుర్తింపు సంఘంగా ఉన్న హయాంలో యాజమాన్యంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని, ఈ అగ్రిమెంట్ను అమలు చేయకుండా అన్ఫెట్ ఐన మైనింగ్ స్టాఫ్ను మజ్దూర్, బద్లి కార్మికులకంటే హీనంగా విధులు అప్పగిస్తూ ఊడిగం చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఉత్పత్తి, లాభాల్లో కీలక పాత్రపోషిస్తున్న ఫ్రంట్ లైన్ సూపవైర్లకు సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తూ ఏండ్ల తరబడి పదోన్నతులు కల్పించకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నారన్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో అధికారులను కాపాడుతూ మైనింగ్, టెక్నికల్ సిబ్బందిపై క్రమశిక్షణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మైనింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ ఒప్పందాలు అమలు కాకుండా అపద్దర్మ గుర్తింపు కార్మిక సంఘం టిబిజికెఎస్ మోకాలద్దుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అనారోగ్యంతో అండర్రెండ్ అన్ఫెట్ అయిన మైనింగ్, టెక్నికల్ సిబ్బందికి సర్ఫేస్లో హోదా తగ్గకుండా విధులు కేటాయించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు మైనింగ్, టెక్నికల్ సిబ్బందిని భాద్యులుగా చేస్తూ క్రమ శిక్షణ చర్యల పేరుతో ఇంక్రిమెంట్ల కోతలు, డిప్రమోట్ చేసే విధానాలకు స్వస్థిచెప్పాలని, విధుల్లో ఉన్న మైనింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్కు అన్యాయం చేస్తూ పదవి విరమణ పొందిన వారిని విటిసీలో నియమించేందుకు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మిర్యాల రంగయ్య, కె.సారయ్య, వైవి.రాము, వీరభద్రయ్య, మద్ది ఎల్లయ్య, ఎం.సమ్మయ్య, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, వట్టికొండ మల్లికార్జున్రావు, ఎస్.వి. రమణమూర్తి, వి. రాజేశ్వర్రావు, ఎం.బాబు, జి.సత్యనారాయణ, ఆసీఫ్ పాషా, కె.రాజేశ్వర్రావు, సాయిపవన్, జి. నర్సింహారావు, సూర్యప్రకాష్, జి. నాగేశ్వర్రావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: