సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అని చెప్పారు.గురువారం హైదరాబాదులోని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ ను ఆయన స్వగృహంలో కలిసి ఘనంగా సత్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు,బెహన్ మాయావతి ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీఎస్పీ పార్టీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైందనే విషయాన్ని తేల్చి చెప్పిందని అన్నారు.ఇక తాడోపేడో తేల్చుకోవడమే మిగిలిందని తెలిపారు.తెలంగాణ భరోసా మహాసభతో రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల శంకారావాన్ని పూరించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించిన ఘనత బీఎస్పీకి దక్కుతుందని అన్నారు.తెలంగాణలో జరుగుతున్న రాక్షసపాలనకు త్వరలోనే చరమగీతం పాడడం జరుగుతుందని తెలిపారు.మాజీ ఐపీఎస్ అధికారిగా,బీఎస్పీ రాష్ట్ర చీఫ్ గా,ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచనలు,సలహాలతో ప్రతి ఒక్క కార్యకర్త తమ తమ కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో పాటిస్తారని చెప్పారు.రానున్న కాలంలో తెలంగాణలో మాత్రం కచ్చితంగా అధికార బదలాయింపు జరిగి తీరుతుందని జోస్యం చెప్పారు.అంతేకాకుండా ముఖ్యమంత్రిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ ప్రజలకు పరిచయం చేయడంతో పాటు ఆ ప్రమాణ స్వీకారానికి జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతిని సైతం ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ నల్లగట్ల రఘు,ధనుంజయ్,కనగల ధనుష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin