Monday, 27 July 2026 07:38:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆగస్టు 1న మార్పు కోసం మహా ఉద్యమం... -ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ

Date : 19 July 2023 03:24 AM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మండల కేద్రంలో ఆగస్టు1న జరిగే చలో హైదరాబాద్ కధన భేరీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ పిలుపునిచ్చారు. షాద్ నగర్ పట్టణంలో కళాశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కెసిఆర్ నియంత పాలనకు చరమగీతం పడేలా కదం కదం కలిపి కదనభేరి మ్రోగిద్దాం అంటూ విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం 1200మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం లాభం పొందుతున్నారని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5300కోట్ల స్కోల్లర్షిప్ పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాల్లో మౌలిక వసతులు కారువయ్యాయి అని, హాస్టల్ పరిస్థితులు మరి దయనీయంగా ఉన్నాయని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆగస్టు 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభని విజయవంతం చేయాలనీ విద్యార్థులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కందడి శ్రీరామ్, విద్యార్ధి నాయకులు పుట్నాల సాయి కుమార్, మహేందర్, శ్రీకాంత్, వంశీ, సాయి, రాకేశ్, సలీం, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :