సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండల చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ శుద్ధ పెళ్లి సాయి కిరణ్ రెడ్డి కంది సునీల్ రెడ్డి కంది మహేందర్ రెడ్డి ఆవాల మహేంద్ర రెడ్డి ముష్కే రాజేష్ నిమ్మల సుమన్ గార్లు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లో చేయడం జరిగింది వీరందరికీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేయకపోవడం వల్ల చంద్రయ్య పల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. యువతను మోసంచేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను సొంత ఏజెన్సీ కాంట్రాక్టు సంస్థకు మళ్లించుకుంటున్నా ప్రస్తుత ఎమ్మెల్యే రైతుల యూరియా కష్టాలు తీర్చలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం లో మండలంలోని అన్ని గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి శూన్యం మండల అభివృద్ధికి నేను తెచ్చిన నిధులను రద్దుచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ గారితో కొట్లాడి వందల కోట్ల నిధులు నర్సంపేట నియోజకవర్గానికి నిధులు తెస్తే అవి చెల్లవని కాంగ్రెస్ పార్టీ అసమర్ధ నాయకులు ప్రచారం చేస్తున్నారు అదే జీవో ల ద్వారా వచ్చిన రోడ్ల పనులు రద్దు చేస్తున్నారు సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్ల దందా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు శుద్ధపెల్లి కేశవరెడ్డి మరియు ఆరెల్లి వీరేశం గౌడ్ పిఎసిఎస్ డైరెక్టర్ పల్నాటి జయపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు అలాగే గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు సీనియర్ నాయకులు గ్రామ యువ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Reporter