సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఏశమల్ల సహస్ర జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలలో విశేష ప్రతిభతో సత్తా చాటింది.ముకుందాపురం గ్రామానికి చెందిన ఏశమల్ల చంద్రమోహన్ కూతురు ఏశమల్ల సహస్ర సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర బేస్ బాల్ జట్టు జాతీయ స్తాయి పోటీల్లో గోల్డెమెడల్ సాధించింది. ఆదివారం బిహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన 41వ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీల్లో సహస్ర అత్యుత్తమ ప్రతిభతో తెలంగాణ జట్టును ప్రథమ స్థానంలో నిలిపింది.దీంతో తెలంగాణ జట్టు గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలాల నుండి సహస్ర ప్రశంశలు పొందింది.జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి నేరేడుచర్ల మండలానికి గర్వకారణంగా నిలిచావని, శభాష్ సహస్ర...అంటూ,గోల్డెమెడల్ సాధించిన జట్టుకు మరిన్ని విజయాలు అందించి,ఎన్నో పతకాలు సాధించాలని కోరుకుంటున్నాం అంటూ పలువురు అభినందనలతో పాటు, ప్రశంసలు కురిపించారు...
-----------------------
Admin