సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి స్థానిక ఎస్టీ హాస్టల్లో ఉంటూ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కంచపోగు రాజేశ్వరి(15), ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కు చెందిన గద్దల శైలజ(17) సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ కు వచ్చి తిరిగి పాఠశాలకు వెళ్లే క్రమంలో అదృశ్యం అయినట్లు స్థానిక వార్డెన్ మాధవి తెలిపారు. వీరి ఆచూకీకై బంధువులు సమాచారం ఇచ్చి ఈ సంఘటన వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి విద్యార్థులు అదృశ్యమైనట్లు గుర్తించి మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి బాలికల ఆచూకీ కొరకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సంఘటనపై స్థానిక ఎస్సై బి. రాము కేసు నమోదు చేసి దర్యాప్తు ఆయన చేస్తున్నట్లు తెలిపారు....
-----------------------
Admin