సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, ఫరూక్ నగర్ జెడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి తదితరులు వినమ్ర శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల స్ఫూర్తితో కేసీఆర్ సంక్షేమ పాలన, అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు హాజరయ్యారు.
-----------------------
Admin