సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : విచ్చల విడిగా పరిమితికి మించి బెల్ట్ షాపులు వేకువ జామున 4 నుండి మద్యం విక్రయాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మాటలకే పరిమితమా రాష్ట్రమంత్రిప్రత్యేక చొరవ తీసుకొని బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలను అడ్డుకట్ట వేయాలని ప్రజల విజ్ఞప్తి రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి విధితమే. కానీ ఆ హమి వాగ్దానాలకే పరిమితమైందని ఆచరణలోకి సాధ్యం కాలేదని సూర్యాపేట జిల్లాలోని గ్రామాల్లోని ప్రజలు పట్టణాల్లోని ప్రజలు ఈ బెల్ట్ షాపులను నిర్మూలించాలని కోరుచున్నారు . మద్యాన్ని వైన్స్ షాపుల ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వమే అమ్ముతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నియంత్రణలో నడుస్తాయి. అయితె నియోజకవర్గాల వారీగా జిల్లావ్యాప్తంగా బెల్ట్ షాపులు విచ్చల విడిగా అనధికారిక మద్యం కేంద్రాలుగా గ్రామాల్లో వెలిశాయి. వీటితో పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. ఇప్పుడు మంచినీళ్లు దొరకని చోటు ఉందేమో కానీ మందు దొరకని పల్లెలు అంటూ లేవు. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన బెల్టు షాపులు ప్రజల్ని మద్యానికి బానిసను చేస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాలలో పరిమితికి మించి ఒక్కొక్క గ్రామంలో 10నుంచి 20 వరకు బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఇందులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. గ్రామాల్లో సమయ పాలన పాటించకుండా వేకువ జామున 4 గంటల నుండీ రాత్రి 11.12 గంటల వరకు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో గల్లి గల్లి కో బెల్ట్ షాపులు ఎంతో మంది తాగుడుకు బానిసై వారి జీవితాలు చిన్నబిన్నం చేసుకున్న సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. మందు మత్తుకు బానిసై ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి జరుగుతున్నాయి. ముఖ్యం గా యువతపై ఇవి తీవ్ర ప్రభావం చూపాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మద్యం కాలేజీలలోకి పిల్లలనుండి పెద్దల వరకు దీనికి బానిస అవుతున్నారు అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. కల్తీ మద్యం దందా కూడా జోరుగా సాగుతోంది. మారో వైపు యువత తాగుడుకు బానిసై అనేక నేరాలకు పాల్పడుతు జైలలో మగ్గుతున్నారు. కొందరు బెల్ట్ షాపు నిర్వాహకులు అధికార పార్టీ అండదండలతో మమ్మల్ని ఎవ్వడ్రా ఆపేది అంటూ విర్రవీగుతూన్నారు. ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి డబ్బే ముఖ్యం అంటున్నారు. మహిళలు ప్రజాసంఘాలు మద్యం బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన బెల్ట్ దుకాణాల నియంత్రకు చెక్ పెడుతుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను మూసి వేయాలి నీటిపారుదల శాఖ & సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బెల్ట్ షాప్ లపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పూర్తి స్థాయిలో పర్యవేక్షించి బెల్ట్ షాపులకు అడ్డు కట్ట వేయాలని ప్రజలు తమ వేదనను వెళ్లగక్కుతున్నరు.
-----------------------
Admin