సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా అచ్చంపేట మండలం దుబ్బతండా గ్రామానికి చెందిన పి.రఘును నియమిస్తూ మంగళవారం కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆదేశాలు జారీచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, నాగర్ కర్నూల్ డీసీసీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా రఘు నాయక్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు, బెల్లయ్య నాయక్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న రఘు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పదవి రావడానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అని కొనియాడారు. కరడు గట్టిన గిరిజన వాది రఘు. కరుడుగట్టిన గిరిజన వాది రఘు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు. మంగళవారం పార్టీ పదవి వరించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు తెలిసిన వారుగా అదేవిధంగా గిరిజన సమస్యలపై గళం ఎత్తిన గిరిజన నాయకుడిగా ఎంతో అపార అనుభవం రఘుకు ఉందని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షులు శీను నాయక్, యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖదీర్, రాజు నాయక్, సూర్య నాయక్, గోపాల్ నాయక్, రఘు నాయక్, రాజు నాయక్, శ్రీను నాయక్, మోహన్ నాయక్, గోపాల్ నాయక్, సంజు నాయక్, మేఘ్య, రమేష్, ముబారక్, హరినాయక్ లక్ష్మణ్ కుమార్ సంతోష్, రాము, సంతోష్, సుమన్, బాబు నాయక్ రమేష్ రాజు, శీను, శంకర్ నాయక్, సురేష్, శంకర్, శీను, రమేష్, నాయక్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin