Monday, 27 July 2026 04:23:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డబుల్ బెడ్ రూం ఇండ్లను సైతం వదిలి పెట్టని అధికార పార్టీ నేతలు ...

Date : 04 March 2023 01:36 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్: పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కలగానే మిగిలిపోయాయని,అధికార పార్టీ నాయకులు ఈ పథకాన్ని సైతం వదిలి పెట్టడం లేదని బహుజన్ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ శుక్రవారం బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు లేని అభాగ్యులు ఈ సారి తమకు ఇంటి ఆసరా దొరుకుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ కొందరు ప్రజాప్రతినిధుల అవినీతి కారణంగా వారి ఆశలు అడియాసలుగా మారాయని పేర్కొన్నారు..తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమకు నచ్చిన వారికి,అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు,వాళ్ళ బంధువులకు,వారి సామాజిక వర్గం వారికి,డబ్బు ముట్టజెప్పిన వారికి కేటాయించేలా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని విమర్శించారు...దీంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు..లాటరీ విధానం ద్వారా కేటాయింపులు జరిగితే ఒక రోజు ముందుగానే వార్డు కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులకు జాబితా ఎలా వచ్చిందని నిలదీశారు...ఓ వార్డు ప్రజా ప్రతినిధి భర్త ఒక్కో ఇంటికి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు విడుదలైన ఆడియో ఈ పథకం అమలులో జరిగిన అవినీతి భాగోతం తేట తెల్లం చేస్తుందని స్పష్టం చేశారు...నియోజక వర్గ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న అధికార నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు...వెంటనే కేటాయింపుల పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అర్హత కలిగిన లబ్ధిదారులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం జేసీ వెంకటేశ్వర్లు కు వినతిపత్రం అందజేశారు.. ఈ కార్యక్రమంలో సంధ్య,గోపిశెట్టి ఆశాకుమారి,ఏడెల్లి మర్థమ్మ,సింగంశెట్టి వందన,ముదరకొల పద్మ,సయ్యద్ జైతునిషా,సంధ్య,హారిక తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :