సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా కార్యాలయం కుమార్ నారాయణ భవన్ లో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు బి కిషన్ అధ్యక్షత వహిం చి ముఖ్య వక్త పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రదీప్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి మన యువతకి ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఒక ఉద్యోగం రాలేదు అన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అమలు కాలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు అచ్చే దిన్, మరొకరు బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న పోస్టుల ను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యవసర సరుకులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై వచ్చే నెల మూడున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సృజన్, స్థాయిలు,గంగాధర్,బోజేo దర్, రవి,యు రవి, మోహన్, రాజారాం తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin