సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక మండలంలోని వెంకట్రావు పేట, చింతల బయ్యారం, సింగిరెడ్డిపల్లి, పాత రెడ్డిపాలెం, రాయిగూడెం గ్రామాల్లో పర్యటించినా బోలె బోయిన శ్రీవాణి నిన్న కురిసిన వడగాళ్ళ వానకు తడిసిన మిర్చి కల్లాలను, పంట పొలాలను రైతులతో కలసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ కాయ కష్టం చేసి లక్షల్లో అప్పుచేసి మిర్చి పంటపై పెట్టారు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి కల్లాలన్నీ తడిచి వరదకు కొట్టిపోయి తీవ్ర నష్టంలో అన్నదాతలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటల బీమా ఉండేదని ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగ పడేదని కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని రైతులకు అమలు చేయడం లేదని ఆమె అన్నారు ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచన వేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కాపాడాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని, రైతులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బోలెబోయిన శ్రీవాణి ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, రైతు కూలీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin