సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : అడవిదేవులపల్లి మండల పరిదిలోని ఉల్సాయిపాలెం గ్రామ0 బంగారిగడ్డ ఆవాసానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త కేతావత్ హాతీరాం, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు బి.ఆర్.ఎస్ పార్టీ సబ్యత్వం కలిగి ఉండడం వల్ల వారికీ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి చొరవతో మంజూరు అయిన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రమాద భీమా 2 లక్షల రూపాయల విలువగల చెక్కును స్థానిక రెడ్డికాలనీలో గల BRS పార్టీ కార్యాలయంలో ఈరోజు వారి కుటుంబీకులకు BRS పార్టీ నాయకులు అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.. కార్యక్రమంలో DCMS నల్లగొండ జిల్లా వైస్ ఛైర్మన్ దుర్గ0పూడి నారాయణ రెడ్డి, తాజా మాజీ ఎంపిపి ధనావత్ బాలాజీ నాయక్, తాజా మాజీ జెడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం నాయక్, నాయకులు ధనావత్ లచ్చీరామ్ నాయక్, పకీర నాయక్, స్వామి నాయక్, లకుపతి నాయక్, లావుడి జాను నాయక్, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin