సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : బోనకల్ మండలం జానకిపురం గ్రామంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్కారమార్క ను కలిసి వినతిపత్రం అందజేసిన న్యాయవాది దిలీప్ చౌదరి తాళ్లూరి.. గత 6 నెలలుగా ఖాళీగా వున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఖమ్మం కోర్టుల్లో ఖాళీగా వున్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మరియు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు అదనపు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ పోస్టలను కూడా కాల్ ఫర్ చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేయగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు సానుకూలంగా స్పందించి పోస్టలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ డ్రాఫ్ట్ తయారు చేసినందుకు భట్టి గారికి కృతఙ్ఞలు తెలియచేసారు..
-----------------------
Admin