సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : తెలంగాణ హాకీ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో ఈనెల 02,03మరియు 04వ తేదీలలో అంతర్ జిల్లాల జూనియర్ మెన్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ,ఈ సందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల యొక్క జట్టు ఈ రోజు అనగా మంగళవారం రోజున ఆర్మూర్ మినీ స్టేడియం నందు ఉదయం 10 గంటలకు ఎంపికలు నిర్వహించడం జరిగింది.ఈ ఎంపికకు దాదాపుగా 44 మంది క్రీడాకారులు పాల్గొన్నారు,ఇందులో నుండి 22 మంది క్రీడాకారులను ఎంపిక చేసి కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది, కోచింగ్ క్యాంప్ లో తుది 18 మంది క్రీడాకారులు జట్టును ఖరారు చేయడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు, ఈ ఎంపిక ప్రక్రియను జిల్లా సంఘం కోశాధికారి పింజ సురేందర్, ఈసీ మెంబర్ నాగేష్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజు, PET Dr. P. స్వామి నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి ,సదమస్తుల రమణ,కోశాధికారి పింజా సురేందర్ , తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ వింగ్ చైర్మన్ ఎం .గంగాధర్, జిమ్మీ రవి , కార్యనిర్వాహక కార్యదర్శి అంజు, ఈసీ మెంబర్ నాగేష్, PET Dr.P.స్వామి, కత్తి శ్రీనివాస్, పాల్గొన్నారు....
-----------------------
Admin