Monday, 27 July 2026 04:34:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డ... - ఎడవల్లి కృష్ణ

Date : 29 September 2023 05:07 AM Views : 346

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డా అని, వనమాని బిఆర్ఎస్ లో టికెట్ ఇవ్వడం కేసీఆర్ దౌర్భాగ్యం, బలహీనత అని, నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకులు ఇసుక దందాలు,కాంట్రాక్ట్ కమిషన్లు, దళిత బంధు కమిషన్లు ఎక్కువైపోయాయని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ పేర్కొన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సందేహం లేకుండా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయం సందేహమే లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ పేదోడికి ఇచ్చిన 75 గజాల ఇంటి స్థలాలు ఏ మూలాన కూడా సరిపోదనీ, అర్హులైన పేదోడికి ఇంటి స్థలం రాలేదనీ, ఇండ్లు ఉన్న వారికే వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర సమాచారం సేకరించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవను పార్టీ సస్పెండ్ చేసిన పార్టీలోనే తిరుగుతున్నాడు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అధికార నాయకులు చేసే అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎమ్మెల్యే పై ప్రజల వ్యతిరేకత ఉందని ఎడవల్లి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అర్హులైన పేదవాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తారని, స్థలం లేని వాళ్ళకి 250 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతారన్నారు. అర్హులైన పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షలు, పేద కూలీలకు సంవత్సరానికి 12 వేలు, నిరుద్యోగ భృతి కి 4000 రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు నెలకి 25 వేలు గౌరవ వేతనం ఇస్తారని అన్నారు. జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం చేపడతారన్నారు. రైతులకు ధరణి పోటు రద్దు చేయడం జరుగుతుందన్నారు. రైతు బంధువు ఇవ్వడం జరుగుతుందనీ ఎడవల్లి కృష్ణ పేర్కొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :