సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చాపల విక్రయం పై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ… కొంతమంది వ్యాపారులు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా, దొంగ బాటలో అమ్మకాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో—అనుమతులులేకుండా, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా చాపలను విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ విక్రయాల వల్ల చెత్త, దుర్వాసన పెరిగి స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు సమస్యను తెలియజేసినప్పటికీ… ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. అనుమతులు లేని వ్యాపారులను వెంటనే తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న ఈ అక్రమ చాపల విక్రయాలపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి.
-----------------------
Reporter