Sunday, 26 July 2026 01:32:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిపేట్ లో ఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు...

Date : 03 September 2023 01:40 AM Views : 334

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ : దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి శ్రీ వై యస్ రాజశఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో నిజాంసాగర్ మాజీ లిఫ్ట్ చైర్మన్ యార్ల సాయిరెడ్డి అన్న గారు నిజామాబాద్ జిల్లా మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీ గొర్త రాజేందర్ అన్న గారు వైయస్సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామబాద్ ప్రజలకు వైయస్సార్ గారికి ఎనలేని బంధం ఉందని గుర్తు చేశారు ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గం లోని అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోత పథకాల ద్వారా సాగు నీరు అందుతుందంటే అది వైయస్సార్ చేసిన కృషి అని అలాగే 108 ద్వారా క్షతగాత్రులని హాస్పిటల్ చేర్చే అంబు లెన్స్ ఏర్పాటు చేశారన్నారు అతి నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటలలో వైద్యం అందించిన ఘనత ఆయనదే అని గుర్తు చేశారు రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీ మొదటి సంతకం చేసింది డాక్టర్ వైఎస్ఆర్ అని గుర్తు చేసుకున్నారు ఆయన చేసిన పథకాలు ప్రతి నిరుపేద గుండెల్లో ఉన్నాయని ప్రతి పేదవాడు వై ఎస్ ఆర్ గారిని తలుచుకోనని రోజు లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర SC సెల్ కన్వీనర్ ప్రమోద్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పెంట ఇంద్రుడు వై యస్ గంగాధర్ ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు ఏడ్డిగారి నిఖిల్ నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తుక్కన్న నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు యూసుఫ్ నందిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పిరాజీ నాగరాజ్ ఉపాధ్యక్షులు ఎర్రం పవన్ సీనియర్ నాయకులు దమ్మాయి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నాయకులు ఎర్రం అజయ్, సోహెల్, ప్రశాంత్, శ్రీకాంత్,యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: