సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో మొక్కజొన్న పండిస్తున్న రైతులకు మొక్కజొన్నలో సోకే కత్తిరి పురుగును నివారించడానికి ఓదిసి మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో మొక్కజొన్న పంటకు సోకిన కత్తెర పురుగును ఎప్పటికప్పుడు నివారణ చేపట్టాలని సూచించారు. గురువారం మండలంలోని కుసుమారుపల్లిలో నారాయణ ,రాజు అనే రైతులకు చెందిన మొక్కజొన్న పంట పొలాలను ఇలియాజ్ పరిశీలించి, కత్తెర పురుగు నివారణ చేపట్టెందుకు 2 కిలోల బెల్లం, 3లీటర్ల నీటిలో కలిపి వాటికి 10 కిలోల తవుడు కలిపి ఒకరోజంత నానబెట్టిన అనంతరం 100 గ్రాముల" లార్విన్ కలిపి చిన్న చిన్న ఉంటలుగా తయారుచేసుకోవాలన్నారు. వుంటలను మొక్కజొన్న కంకుల సుడిలో కింద పడిపోకుండా ఉంచాలన్నారు. వ్యవసాయ అధికారి ఇలియాజ్ వెంట వీఏఏ పవన్ కుమార్ రైతులు ఈశ్వరయ్య, రామంజి , మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin