Monday, 27 July 2026 04:31:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అవయవ దానం పై చైతన్యం చేద్దాం... -డాక్టర్ లయన్ నటరాజ్

Date : 20 July 2023 08:07 AM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : లైన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ 31 వ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో నూతన కార్యవర్గం ఎన్నిక. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, జులై 19, సర్కార్ టీవీ. శరీరం దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మెన్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ లయన్ నటరాజ్ అన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ 31వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం షాద్ నగర్ బగ్గారెడ్డి గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ అధ్యక్షులు లయన్ సందీప్, సెక్రెటరీ లయన్ డి.అక్షయ్ పటేల్, ట్రేజరర్ ఎం. వెంకట్ రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి లయన్ నటరాజ్ తో పాటు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ మనోజ్ కుమార్ పురోహిత్, లయన్ మహేంద్ర కుమార్ రెడ్డి, జోన్ చైర్ పర్సన్ లయన్ రమాదేవి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి లయన్ నటరాజ్ మాట్లాడుతూ.. అవయవ దానం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఎంతోమంది చనిపోయాక వారి పార్థివ దేహాన్ని మెడికల్ రీసర్చ్ విద్యార్థులకు దానం చేయడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాదు చనిపోయిన వ్యక్తుల అవయవాల దానం, నేత్ర దానం వల్ల ఎంతోమందికి ముఖ్యంగా చూపు లభిస్తుందని ఇంకా అనేక అవయవాలు ఉపయోగపడతాయని చనిపోయాక కూడా బ్రతకవచ్చని ఆయన అన్నారు. షాద్ నగర్ పట్టణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కీర్తిశేషులు నాగిళ్ల లింగమూర్తి కుటుంబ సభ్యులు అవయవదానం చేశారని అదేవిధంగా సామాజికవేత్త మలిపెద్ది శంకర్ సతీమణి కూడా అవయవ దానం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో 21 మంది అవయవదానం చేసినట్టు చెప్పారు. అవయవ దానం చేయాలనుకునేవారు లయన్ క్లబ్ ను తప్పకుండా సంప్రదించవచ్చని అన్నారు. మనిషి చనిపోయాక కూడా తమ అవయవాలతో ఇతరులు బ్రతికే ఒక బృహత్తర లక్ష్యం ఇదని అన్నారు. ఎంతో మందికి చూపు లభిస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. నేత్రదానం ఎంతో గొప్పదని ఆయన విశధికరించారు. తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. జోన్ చైర్మన్ లయన్ రమాదేవి మాట్లాడుతూ.. సంఘంలో సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. చైర్మన్ గా తన సేవలను విస్తృత పరిచి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ.. సమాజంలో సేవకు మించిన సంతృప్తి మరొకటి ఉండదని అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సేవలతోనే గుర్తింపు లభిస్తుందని అన్నారు. ప్రభుత్వాలు ఎంతో చేస్తున్న ఇంకా ఎంతో మంది సమాజంలో అభాగ్యులు ఉన్నారని వారి కోసం మన వంతు సాయం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ.. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృత పరుచుతున్నట్లు చెప్పారు. డయాబెటిక్ పరీక్షలు, రక్తదాన శిబిరాలు, చైల్డ్ క్యాన్సర్ అవేర్నెస్, ఐ విజన్ ఇంకా అనేక కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. క్లబ్ సభ్యులతో పాటు అందరూ సహకరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా క్లబ్ లో ఆరుగురు కొత్త సభ్యులు చేరగా వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. మధురాపురం ఎంపీటీసీ భార్గవ కుమార్ రెడ్డి నూతనంగా సభ్యత్వం తీసుకున్నారు. అదేవిధంగా షాద్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి దుప్పట్లు, మెడికల్ కిట్లు ఉచితంగా అందజేశారు. అదే విధంగా కిషన్ నగర్ వేద పాఠశాల కోసం లయన్ దండు శరత్ బాబు జ్యోతి ప్రజ్వలన చిమ్మెళ్లను ఉచితంగా అందించారు. మానవసేవే మాధవసేవ నినాదంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ శ్రీనివాసులు, ప్రేమ్ సాయి కుమార్, దండు శరత్ బాబు, మనోహర్ రెడ్డి, గుర్రం రవీందర్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి, గడ్డమీది సుధాకర్, గుండుబావి శ్రీనివాస్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ రెడ్డి, స్థానిక వైద్యులు విజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, చందులాల్ రాథోడ్, రమేష్ బండారి, నాగవర్ధన్ రెడ్డి, సురేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :