Sunday, 26 July 2026 01:59:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మన ఊరు -మన బడి కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా పర్యటన

Date : 22 December 2022 12:49 AM Views : 491

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలంలో బుధవారం రోజున జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా పర్యటించడం జరిగింది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమం కింద పలు స్కూల్లాలో చేపడుతున్న పనులలో నాణ్యత లోపించ కుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. బుధవారం రోజున బాల్కొండ మండలంలోని, బోదేపల్లి ,జలాల్పూర్, నాగాపూర్, బస్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ లు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.ఉపాది హామి పనులు సాధ్య మైనంత త్వరగా పూర్తి చేయాలని, గ్రీన్ చానల్ ద్వారా నిధులను విడుదల చేయడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు.మండల మోడల్ స్కూల్ ల లో జరిగే పనుల నాణ్యతను పరిశీలించి పలు సూచనలను ఇచ్చారు.నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని, ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చాలా వరకు స్కూల్ ల నిర్వహణ కమిటీలకే పనుల బాధ్యతలు అప్పగించినందున, ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. గోడలకు ఎక్కడ కూడా పగుళ్లు కనిపించకూడదని, అలాంటి చోట్ల స్క్రబ్ చేయించిన తర్వాత ప్లాస్టరింగ్ పనులు జరిపించాలన్నారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, ఎస్ఎంసీ ప్రతినిధులు సొంత పనులుగా భావిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. కిటికీలు, తలుపులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, పైకప్పు లీకేజీలు ఉండరాదని అన్నారు.ఎం పి డి ఓ సంతోష్ కుమార్ ను ఉపాధి హామి పనుల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ బట్టు రాజేశ్వర్, అసిస్టంట్ ఇంజనీర్ వినీత్ కుమార్, ఏ పి ఓ ఇందిర ,ఆయా గ్రామాల సర్పంచ్ లు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :