సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని వర్థాపురం గ్రామంలో ఇంటింటికి "అయోధ్య శ్రీరామ అక్షింతల వితరణ" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండగ రోజున మఠంపల్లి మండలంలోని వేణుగోపాల స్వామి ఆలయంలోకి" శ్రీరామ జన్మభూమి ట్రస్ట్" వారు పంపించిన "అక్షింతలకు", పూజారులచే, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరదాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ అక్షింతలకు , పూజారిచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో అంగ రంగ వైభవంగా, శోభానుమాయంగా , మేళతాళాలతో రామ భక్తులు, మహిళలు, భజనలు చేస్తూ, "రామనామం" స్మరిస్తూ , ప్రతి ఇంటింటికి అయోధ్య బాల రాముని అక్షింతల వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .అలాగే గ్రామంలో రామాలయం నిర్మించుకునేందుకు నిధి సమీకరించడం సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు అయోధ్య శ్రీరామ జన్మ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు,రామ భక్తులు, భక్తురాల్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin