Monday, 27 July 2026 05:21:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇవ్వాలి.... మూడు సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 17 August 2023 06:35 AM Views : 409

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: సింగరేణి సంస్థలో మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు సర్వీస్ లో ఉండి ఒక సంవత్సరం మస్టర్ ను ప్రాతిపదికన తీసుకొని డిస్మిస్ అయిన కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.బుధవారం పార్టీ కార్యాలయంలో సింగరేణి డిస్మిస్ అయిన కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు ఉద్యమ నేతగా కెసిఆర్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆంధ్రా పాలకులు నిర్దాక్షిణ్యంగా తొలగించిన ప్రతి సింగరేణి కార్మికుని గుండెలో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి మరోమారు సింగరేణి కార్మికులుగా ఉద్యోగ భృతిని కల్పిస్తానని చేసిన వాగ్దానాన్ని ఇకనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.2000 సంవత్సరం నుంచి డిస్మిస్ కార్మికులు ఇప్పటివరకు వివిధ రూపాలలో తమ బాధను,ఆవేదనను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ కంటితుడుపు చర్యగా వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప డిస్మిస్ కార్మికులకు భరోసా కల్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సింగరేణి వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలగించిన కార్మికులు 100 లోపు ఉన్నారని,వారికి కూడా ఒక అవకాశం కల్పిస్తే ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.మూడు,నాలుగు సంవత్సరాల సర్వీసు తోపాటు ఒక సంవత్సరంలో 100 మస్టర్లను ప్రాతిపదికన తీసుకొని వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలన్నారు.ఈవిషయంలో సింగరేణి యాజమాన్యం,గుర్తింపు సంఘం,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈకార్యక్రమంలో డిస్మిస్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెనిగారపు నిరంజన్ కుమార్,డిస్మిస్ సంఘం నాయకులు గంధం మల్లికార్జున్ రావు,కన్నబోయినా మురళి,బీఎస్పీ పట్టణ అధ్యక్షుడువంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :