సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : సీపీఐ 98 వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, కొండ మల్లేపల్లి లో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో డిసెంబర్ 26న ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనేక కుట్ర కేసులు ఎదుర్కొని, లక్షలాదిమంది ప్రాణ త్యాగాలతో,ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన ఘనత సిపిఐ దే నని, సీపీఐ 97 సంవత్సరాలు పూర్తి చేసుకుని 98వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కూడు,గూడు లేనటువంటి నిరుపేద ప్రజలకు అండగా ఎర్రజెండా ముందు ఉంటుందని వారు అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4 వేల500 మంది ప్రాణాలు ఇచ్చి, లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీలకు లేదని వారు కొనియాడారు.నేడు పాలకవర్గాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు....
-----------------------
Admin