సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొత్తచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శివ సాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్.ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కొత్తచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, శివ సాయి జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా భాగంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు సిద్ధంగా ఉంచాలని, పరీక్ష హాల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలన్నారు. పరీక్షలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు....
-----------------------
Admin