Sunday, 26 July 2026 08:19:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పలు అభివృద్ధి కార్యక్రమాలపై విలేకరుల సమావేశం... - ఎమ్మెల్యే వనమా

Date : 09 September 2023 05:35 AM Views : 227

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని రుద్రంపూర్ ప్రాంతంలో మాయాబజార్, వనమా నగర్ కాలనీ, ఎస్ ఆర్ టి నగర్లో సింగరేణి ఓపెన్ కాస్ట్ కారణంగా గత 40-50 సంవత్సరాల నుండి నివసిస్తున్న వారి ఇండ్లు కోల్పోయిన వారికి హెడ్ ఆఫీస్ ప్రక్కన స్థలం సర్వే చేసి వారం రోజుల లోపు ఈ మూడు కాలనీవాసులకు మరియు రైల్వే ట్రాక్ పక్కన గత పది సంవత్సరాల నుండి నివసిస్తున్నా ఇండ్లను కూల్చివేయడంతో అక్కడి నివాసులకు కూడా వారం రోజుల లోపు పక్కా సర్వే చేసి వీరందరికీ సుమారు 300 -350 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందని వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలాగే స్థలం కోసం స్థలం లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నా వారందరికీ సర్వే చేసి 22 ఎకరాలలో పాత కొత్తగూడెంలోని డబల్ బెడ్ రూమ్ పక్కన సుమారు 900 నుండి 1000 మందికి నిజమైన అర్హులనీ గుర్తించి ఇంటి స్థలం లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం చేపడతానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీనితోపాటు గృహలక్ష్మి పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు నియోజకవర్గంలో మొదటి విడతలో 3,000 మందికి ఇండ్లు నిర్మించుకోవడానికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున సాంక్షన్ చేయడం జరుగుతుందన్నారు. రెండవ విడతలో మళ్లీ 3,000 మందికి గృహ లక్ష్మి పథకం ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకై పాల్వంచ పట్టణానికి 100 కోట్లు కొత్తగూడెం పట్టణానికి 115 కోట్లు కేటాయించారన్నారు. దీనితోపాటు 35 కోట్లతో మొర్రేడు బ్రిడ్జి రిటర్నింగ్ వాల్, పాత పాల్వంచలోని చింతలచెరువు ని మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ మినీ ట్యాంక్ బండ్ కొరకు రోడ్డు ట్యాంక్ బండ్ పైన సెంట్రల్ లైటింగ్ నిర్మాణాన్ని చేపడతారన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: