సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండలం వైసిపి కార్యకర్తలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానిక ఐటిఐ కళాశాల ప్రాంగణంలో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ రూపురేఖలే మార్చేస్తున్నట్లు చెప్పారు. పూరి గుడిసెలు, కారుతున్న ఇల్లు లేకుండా పక్కా ఇల్లు నిర్మించేందుకు అవకాశం వచ్చిందని ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 23 వేల పక్కా గృహాలు మంజూరైనట్లు చెప్పారు వీటిని నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రెండో విడతలో మరిన్ని ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పొరుగు నియోజకవర్గ ప్రజలు కూడా పుట్టపర్తి నియోజకవర్గం లో ఏదో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోతుందని మన వైపు చూసేలా ఇక్కడ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఓబుల్ దేవర చెరువు మండల పరిధిలోవైయస్సార్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సమావేశానికి ముఖ్య ఉద్దేశం వైయస్సార్ పార్టీ మండల కమిటీ లో కూడా ఒక అధ్యక్షుడు ఇద్దరు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ముగ్గురు కోశాధికారి ఒక్కరు కార్యదర్శులు ఐదు మంది కార్యవర్గ సభ్యులు 15 మంది తో 30 మంది సభ్యులతో మండల కమిటీ నిర్ణయించారు రాబోయే 2024 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు నాయకులకు గ్రామ అధ్యక్షులకు రాబోయే ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు.వైఎస్ఆర్ పార్టీ మండల కమిటీ 30 మంది సభ్యులు లో ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు 50% అంటే 15 మందికి30 మంది ఉండాలి మిగిలిన 15 మంది సభ్యులు అన్ని సామాజిక వర్గాలకు కులాలు కలుపుకొని కమిటీ ఏర్పాటు చేయాలి మండల కమిటీలు మొత్తం 30 మందిలో మహిళలు కు కూడా 10% అంటే ముగ్గురికి ఈ కమిటీలు కలుపుకోవాలి . ఈ కార్యక్రమంలో ఓబుల దేవర చెరువు జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin