Sunday, 26 July 2026 02:14:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే గారూ... నియోజవర్గంలో మధ్యం సిండికేట్ పై మీ వైఖరి ఏంటి...?

Date : 08 January 2024 01:03 AM Views : 213

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పాల్వంచ,రామవరం,సుజాత నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యం వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి నిర్వహిస్తున్న మద్యం సిండికేట్ వ్యాపారంపై ఎమ్మెల్యే కూనంనేని వైఖరి ఏంటో తెలపాలని బీఎస్పీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రశ్నించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మధ్యం సిండికేట్ విచ్చల విడిగా నడుస్తోందని,ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు మధ్యం అమ్ముతున్నారని, మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎక్కువ ధరలకు మధ్యం అమ్ముతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తారని ఆరోపించారు.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూనంనేని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని,పదేళ్లు అధికారం లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారని,ఆ భూకబ్జాలకు వ్యతిరేకంగా ఒక్క బీఎస్పీ పార్టీ మాత్రమే పోరాటం చేస్తూ ముందుకు సాగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారో సృష్టం చేయాలన్నారు.పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నప్పటికీ ఆ డిమాండ్ ను పెడచెవిన పెడుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికలు జరిపించి తీరాలన్నారు. ఈకార్యక్రమంలో సాయి, చెనిగారపూ నిరంజన్ కుమార్, నాగుల రవికుమార్, సందెలా సందీప్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: