సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 25 వ వార్డులో కంటి వెలుగును ప్రారంభించిన M.R.O రామకృష్ణ కొత్తగూడెం పట్టణంలోని 25 వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని M.R.O రామకృష్ణ ప్రారంభించారు. 25 వ వార్డు కౌన్సిలర్ సహేరా బేగం నాయకత్వంలో ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగుతుందని మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు యం.డి యూసుఫ్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం మార్చ్ 03 తేదీ వరకు కొనసాగుతుందని తెలియజేశారు. వార్డు ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అలాగే అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని తెలిపారు.
-----------------------
Admin