సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో జక్కుల జగదీశ్, పురేటి చిలకరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం అయన ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. సమాజంలో బహుజనులు గౌరవప్రదంగా జీవించేందుకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు.ఆయన స్ఫూర్తితో బహుజనులంతా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేయటం ఎంతో సంతోషంగా ఉంది అని, జక్కుల జగదీశ్, పురేటి చిలకరావు విగ్రహ ఏర్పాటుకు ఎంతో కృషి చేసారని అయన ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, ఎంపీపీ శ్రీరామ్ మూర్తి,జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి సర్పంచ్ పోడియం సత్యవతి, ఎంపీటీసీ మారుతి లలిత,జక్కుల జగదీశ్, పురేటి చిలకరావు, నల్లపు లీలా ప్రసాద్, బిర్రం వెంకటేశ్వరరావు, ఉప్పల ప్రసాద్,మాలోత్ అలీ,జక్కుల రాంబాబు మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
-----------------------
Admin