Monday, 27 July 2026 12:45:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టిడిపి నాయకులు...

Date : 19 February 2023 02:22 AM Views : 678

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చనాయుడు , శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి కే పార్థసారథి ఆదేశాల మేరకు నిన్నటి రోజున రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనపర్తి సభకు పోలీసులు అనుమతి ఇచ్చి మళ్లీ రద్దుచేసి చంద్రబాబు అనపర్తి పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ, నిరంకుశ వైఖరిని నశిస్తూ పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకో ప్రభుత్వం పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వై సి పి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు సభను అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి వెంకట్ రాముడు, పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి హుజూర్ లాఖాన్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామలింగ, జిల్లా ఆఫీసు సెక్రటరీ సాయి ప్రసాద్, ముస్లిం మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు రియాజ్, ఉపాధ్యక్షుడు వాజిద్, పట్టణ ప్రధాన కార్యదర్శి వలీ పీర్, హిందూపురం పార్లమెంట్ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి షౌకత్, ముస్లిం మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దన్న, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆండ్రూస్, 17వ వార్డ్ ఇంచార్జ్ చంద్ర, క్లస్టర్ ఇంచార్జ్ ఆవుల నరేంద్ర, చంద్రమౌళి (నాని), 13వ వార్డు ఇన్చార్జ్ నంజుండ, ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాదిర్, పట్టణ బీసీ సెల్ కార్యదర్శి నాగరాజు, కుమ్ము వెంకటేష్, నజీర్, నియోజకవర్గ రైతు కార్యదర్శి వడ్డె నాగప్ప, రైతు మండల అధ్యక్షుడు పోతిరెడ్డి, శివ,టెంకాయల ఫారుక్, హర్షద్ అలీ, షమున్, నాగరాజు, నారాయణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :