సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ను, క్రీడాకారులను మంగళవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ముచ్చటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రజలను కలుసుకొని వారి ఆవేదన, మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మార్నింగ్ వాక్ కు రావడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గత 9 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పార్టీపై ఆగ్రహవేషాలతో ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఎలాగైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదైతే జరుగుతుందని ఆకాంక్షించారో కొత్తగూడెం ప్రజలు కూడా అదే మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి అన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉకంటి.గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, ఆకునూరి కనకరాజు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin