సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ పక్కా ప్రణాళికతో నిఘా ముమ్మరం చేయాలని కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ సూచించారు.కలెక్టరేట్ నందు ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల పరశీలకులు, జిల్లా ఎస్.పి. రాహుల్ హెగ్డే తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు తీసుకోవాల్సిన చర్యలు, అవలంభించాల్సిన పద్దతులు, జాగ్రత్తలు, రక్షణ బందోబస్తు, ఎన్నికల సామగ్రి తరలించే క్రమంలో భద్రత, రూట్ మొబైల్స్ బందోబస్తు, నిబంధన మేరకు రక్షణ బందోబస్తు ఏర్పాటు, సిబ్బందిని కేటాయింపు, అధికారుల మధ్య సమన్వయం లాంటి ముఖ్యమైన విషయాలపై కలెక్టర్ వివరించారు. అదేవిదంగా ఈ వీ ఎం లు పోలింగ్ కేంద్రాలకు తరలించడం, ఎన్నికలు ముగిశాక కౌంటింగ్ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడం ప్రధానమైనదని వివరించారు. తదుపరి పరిశీలకులు మాట్లాడుతూ పోలింగ్ బూత్ ల వద్ద జాగ్రత్తలు పాటించాలని, మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోబలపై ప్రజల నుండి అధిక సంఖ్యలో పిర్యాదులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ టీమ్స్, సర్వే లైన్స్ టీమ్స్ యాక్టివ్ గా పని చేయాలని సూచించారు. అనంతరం ఎస్.పి మాట్లాడుతూ ఎన్నికల రక్షణకు పక్కా ప్రణాళికతో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో సాదరణ పరిశీలకులు బాలకిషన్ ముండా, డాక్టర్ కౌశిగన్, పోలీస్ పరిశీలకులు ఫర్హాత్ అబ్బాస్, వ్యయ పరిశీలకులు విజయ్ నెట్ కె, యస్.పి. రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin