సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపిఓ కార్యాలయం ముందు ధర్నా ..... సమస్యలతో కూడిన వివరాండాన్ని ఇవ్వడం జరిగింది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో. సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ తపాలా శాఖ తెచ్చినటువంటి ఇన్సూరెన్సపాలసీ ఏదైతే ఉందో పది లక్షల రూపాయలు ఆ పాలసీ పంచాయతీ కార్మికులందరికీ అమలు చేయాలని ఆయన కోరారు. అలాగే పండగ మరియు ఆదివారం నాడు కార్మికులందరికీ సెలవు దినాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనేక పంచాయతీలలో యూనిఫాం కొబ్బరినూనె చెప్పులు మాస్కులు బ్లౌజులు ఇంతవరకు ఇవ్వకుండా కార్మికులతో పని చేస్తున్నారని అవి వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు గతంలో ఆదివారం సెలవు దినాలను ప్రకటించాలని సిఐటియు చేసిన పోరాట ఫలితంగా సూర్యపేట జిల్లా డిపిఓ జీవోను రిలీజ్ చేసిందని దాని మిగతా అన్ని పంచాయతీల్లో అమలు చేయాలని ఆయన కోరారు అలాగే పంచాయతీలలో మల్టీపర్పస్ విధాన రద్దు చేయాలని కారోబార్ కు బిల్ కలెక్టర్ లకు పదోన్నతులు కల్పించాలని ఆయన తెలియజేశారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సతీష్ మరియు జిల్లా నాయకులు మధు, నరసింహారావు, విజయ్,పోల్ సింగ్, నరేష్, బాదావత్ వీరన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin