సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మండలంలో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం చిన్న గురిజాల మరియు జి జి ఆర్ పల్లె గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించనైనది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని అలాగే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరికీ పూర్తి అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కావున ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేసే పార్టీ గెలుపుకు సహకరించాలి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అధ్యక్షుడు కత్తి కిరణ్ కుమార్ అన్నారు అలాగే గ్రామంలో నూతనంగా గ్రామ పార్టీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది చిన్న గురిజాల గ్రామ పార్టీ అధ్యక్షునిగా రాగిరి కమలాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిట్టపల్లి కిషోర్ ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి స్వామి మరియు జి జి ఆర్ పల్లి గ్రామ పార్టీ అధ్యక్షునిగా మిట్టపల్లి సురేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరబోయిన రాకేష్ ప్రధాన కార్యదర్శిగా బుస రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకొని అలాగే ఈ రెండు గ్రామాలలో గ్రామల పూర్తి కమిటీలను కూడా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జి రాజు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పెండ్యాల మధు మండల పార్టీ ఉపాధ్యక్షులు దౌడు భాస్కర్ మరియు చెన్నారావుపేట మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ మరియు సీనియర్ నాయకులు అమ్మిరెడ్డి శంకరయ్య మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యకర్తలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు
-----------------------
Reporter