సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నిరుద్యోగులను మోసం చేసిన సీఎం , పర్యటన ను అడ్డుకుంటాం పట్టణ బి.ఆర్.ఎస్.వి అధ్యక్షులు దేవోజు హేమంత్ , కుమార్ నర్సంపేట పట్టణ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు దేవోజు హేమంత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగాఈ సందర్భంగా వారు మాట్లాడుతూ - కేసిఆర్ హయాంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన నిధులతోనే శంకుస్థాపనలు ప్రారంబొత్సవలు చేస్తున్నారు అని తప్ప కొత్తగా నర్సంపేట నియోజకవర్గానికి మిరు ఇచ్చిన నిధులు ఎమిలేవు అని అన్నారు.. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు *నియోజకవర్గంలొని పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీ తొ పాటు నర్సింగ్ కాలేజీ సైనిక్ స్కూల్ & అన్ని మండల కేంద్రాల్లో SC, BC,ST మైనారిటీ గురుకుల పాఠశాలలు & కళాశాలలు నర్సంపేట పట్టణంలో అన్ని వర్గాల విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు తిసుకొని వచ్చి ఈరోజు నర్సంపేట నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తిర్చిదిద్దినటువంటి ఘనత మా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది అని అన్నారు అసెంబ్లీ ఎన్నికల నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు & నిరుద్యోగ భ్రూతి & మహిళా విద్యార్థులకు స్కూటీలు & 5 లక్షల రూపాయల విద్య భరొస కార్డు ఇస్తామని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా రేపటి ముఖ్యమంత్రి గారి పర్యాటనను BRSV ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరిస్తావున్నము.. పెండింగ్ లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..- విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి అన్నారు .. విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ కాకపోవడం వల్ల పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసె వరకు బిఆర్ఎస్వీ తరుపున మా పోరాటం ఆగదు అని తెలియజేశారు ...- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగులు ,విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో బానోతు ప్రవీణ్, బానోతు జీవన్,భూక్య ప్రశాంత్, మంకిడి సూర్యప్రకాష్,మంకిడి వికాస్, మంకిడి వెంకటేష్, హరీష్, సోలం శ్రీకాంత్,శివశంకర, మనోహర్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter