Sunday, 26 July 2026 07:56:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్చకులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్... -రఘువరన్ ఆచార్యులు

Date : 07 July 2023 02:22 AM Views : 865

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణ పరిధి లోని శ్రీరామరక్ష సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆధ్వర్యంలో అధ్యక్షులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు నూతన నూతన వ్యక్తులను కార్యవర్గంలోకి ఆహ్వానించి నియామక పత్రాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు అండగా నిలుస్తుంది.ఇప్పటివరకు గ్రామాల్లో ఉన్న దేవాలయాలు డి డి యన్ పథకం కింద ఆలయ అర్చకుల భద్రత చూసుకున్న ప్రభుత్వం కొన్ని దేవాలయాలను మాత్రం విస్మరించింది. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇటు డి డి యన్ కు సంబంధం లేకుండా గ్రామ కమిటీలు మరియు వంశ్య పారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల పరిస్థితి వర్ణనాతీతం.సరిగ్గా జీతాలు రాక ఆలయాలకు భక్తుల కొరత కార్యక్రమ నిర్వహణకు నిధులు విరాళాలు అందక కొందరు అర్చకులు భగవంతుని సేవలకు దూరం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.అలాగే నేడు ఉన్న ఆలయాల పరిస్థితి చూస్తే ఒక గ్రామంలో మూడు నాలుగు ఆలయాలు ఉండి అర్చకులు మాత్రం ఒక్కరో ఇద్దరో ఉండటం కొన్ని ఊర్లలో అర్చకులు కరువైన వైనం చోటు చేసుకుంది.ఇటువంటి తరుణంలో అన్ని గ్రామంలో ఉన్న ఆలయాలను ధూప దీప నైవేద్య పథకం కింద జేత చేసి ఆలయ అర్చకులను ఆదుకోవాలని కోరుతున్నాం.అదే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆలయ అర్చకుల తారతమ్యం లేకుండా ప్రభుత్వం గుర్తించి అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని తద్వారా అర్చకులకు అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం ఉంటుందని పేర్కొన్నారు.శ్రీరామరక్ష సోషల్ సర్వీసెస్ తెలంగాణ కార్యవర్గంలోకి నూతనంగా సభ్యులను ఆహ్వానించి బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో భట్టారం వంశీ కృష్ణ, గోమటం రాఘవా చార్యులు, మరింగంటి వరదా చార్యులు, చిలకమర్రి శ్రీనివాసా చార్యులు, చోడవరపు రమణ శర్మ నెల్లుట్ల వెంకట్ , చింతపట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :