సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్ నగర్ : దేశ ప్రజల గుండెల్లో రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారని... పేద ప్రజల భవిష్యత్తును మార్చిన రాజీవ్ గాంధీని దైవ సమానులుగా దేశ ప్రజానీకమంతా భావిస్తున్నారని టిపిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. స్వార్థం లేని రాజకీయ నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరని, చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిస్వాద పరిపాలన అందించిందని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫరక్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పిసిసి నెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, చటాన్ పల్లి కౌన్సిలర్ శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మసూద్ ఖాన్, ఖదీర్, ముబారక్, అందేమోహన్, హైదర్ గోరి, ఆసిఫ్ గోరి, బాబా, జఫర్ ఖాన్, గణేష్, నవీన్, రాయికల్ శ్రీనివాస్, బచ్చలి నరేష్, గంగనమోని సత్తయ్య, అప్పారెడ్డిగూడ మాజీ సర్పంచ్ మల్లేష్, సీతారాములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin