సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమర్ధవంతగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ వినీత్ జిలతోపాటు పలువురు అధికారులను కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అభినందనలు తెలిపారు. అధికారులకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంవెళ్లే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. భవిషత్తులో సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిస్కారంకోసం కృషిచేస్తామని తెలిపారు.
-----------------------
Admin