సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రం లో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా గౌనిపల్లిలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని సీతారామ కళ్యాణోత్సవం కన్నుల పండుగ సాగింది ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కోలాహలం నెలకొంది. మంగళ వాయిద్యాలు నడుమ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని కట్టారు ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తజనం రామనామ స్మరణలో మునిగిపోయారు. అనంతరం అర్చకులు సురేష్ శర్మ, హర్ష వర్ధన్ స్వామీ, సంతోష్ స్వామి స్వామివారి విగ్రహాలకు అభిషేకం, అష్టోత్తర పూజలు చేశారు అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు....
-----------------------
Admin