సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దే రాజ్యమని, రాబోయే ఎన్నికల్లో విజయ డంక మ్రోగిస్తామని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. అధికార పార్టీలో తమ ఎంతో నష్టపోయామని పార్టీలో చేరిన కార్యకర్తలు అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోగల 19వ వార్డు 21వ వార్డు నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 8మంది పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య, శర్బద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో డి. కృష్ణ, ఆర్ లక్ష్మణ్, సత్యనారాయణ, వి రమేష్, జంగయ్య, రాఘవేందర్, టి కృష్ణ, ఎండి మస్తాన్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జనాదరణ పొందడం ఖాయమని కర్ణాటక తరహాలోని తెలంగాణలో కూడా విజయదుందుభి మోగిస్తుందని అన్నారు.
-----------------------
Admin