సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : పలు కుటుంబాలను పరామర్శించిన హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొంత వెంకట్ రెడ్డి తండ్రి బొంత నర్సిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు.వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి, తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మోత్కూర్ వెంకటేశ్వర్లు ఎస్ డబ్ల్యూ సి ముఠామేస్త్రి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మండల,స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin