సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మండలం లోని రేగులగూడెం, చంద్రలగూడెం,తుమ్మలగూడెం తదితర గ్రామాల్లో TPCC జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న మోసాల నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడం కోసం 6 గ్యారంటీలను తుక్కుగూడలో తెలంగాణ విజయభేరి సభలో ప్రకటించారని,తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 6 పథకాలను అమలు చేస్తారని అన్నారు.బడుగు బలహీనర్గాల కొరకు 1.మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం - రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,2.ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.3చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు.4.గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.5.రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు.6.యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతుంది అన్నారు.వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తేవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడు కొండం వెంకన్న గౌడ్,మండల OBC అధ్యక్షులు కట్టా సోమయ్య,పట్టణ అధ్యక్షులు చారి,గుండా శ్రీనివాస రావు,బత్తుల వెంకటేశ్వరరావు, కొర్స బాబు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin