సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవరచేరువు మండలంలో గల అన్ని రైతు భరోసా కేంద్రంల నందు సోమవారం నుండి విత్తన వేరుశనగ పంపిణీ చేయడం జరుగుతుంది. మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్ పేర్కొన్నారు వారు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి విత్తనం కొరకు ఆర్ బి కే లో రిజిస్టరు చేసుకొని డబ్బులు కట్టిన ప్రతి రైతులకు విత్తన పంపిణీ చేయడం జరుగుతుంది.కావున ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే వేరుశనగ విత్తన పంపిణీ ప్రతి రైతు వినియోగించుకోవాలని తెల్పడమైనది. రైతులు తమ సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించాలి. ఇంకా ఎవరైనా రైతులు నమోదు చేసుకొకుండా ఉంటే వెంటేనే వారు తమ ఆధార్ కార్డు కాపీ, ఫోన్ నెంబర్ మరియు పట్టాదార్ పాసుబుక్ కాపీ రైతు భరోసా కేంద్రం నందు చూపించి విత్తనం పొందవచ్చు .వేరుశనగ పంపిణి వివరములు. అర ఎకరం వరకు 30 కేజీలు - రూ1674 అర ఎకరా నుండి ఒక ఎకరం వరకు 60 kg- రూ3348 ఒక ఎకరా లపైన 90 kg- రూ 5022 రేపు ఉదయం11 గంటలకు మండల వ్యవసాయ అధికారి వారి కార్యాలయం నందు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది.కావున ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు,మండల అగ్రీ అడ్వైసరి బోర్డు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు,మరియు ఇతర ప్రజా ప్రతినిదులు, హాజరు కావాలని మండల వ్యవసాయ అధికారి ఎస్.ఇలియాజ్ మహమ్మద్ కోరడమైనది.
-----------------------
Admin