Sunday, 26 July 2026 10:04:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్ఎంపి, పిఎంపీల సర్వసభ్య సమావేశం...

Date : 30 October 2023 01:30 AM Views : 219

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండల కేంద్రంలో మండల రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మండల ఆర్ఎంపి సంఘం అధ్యక్షులు చింత్రియాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నిర్వహించారు.ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన9 1/2 సంవత్సరాల కాలంలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులకు కనీసం గుర్తించలేదని కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ తరగతులు ప్రారంభించలేదని పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించలేదని తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్ఎంపి పిఎంపీలు విశేష కృషి చేశారని కరోనా కష్టకాలంలో కూడా అనేకమంది పేద ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సలహాలు జాగ్రత్తలు వివరిస్తూ అనేకమంది ఆర్ఎంపి పిఎంపీలు తమ అమూల్యమైన ప్రాణాలు కూడా కోల్పోయారని వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాటుకు మరణించిన ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులకు కనీసం ప్రభుత్వ సహాయం చేయలేదని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల అప్పుడు ఆర్ఎంపి పిఎంపీలను పొగుడుతూ వారి సేవలు వినియోగించుకుంటూ మాయమాటలతో మభ్యపెడుతూ ఎన్నికలు అయిపోగానే కరివేపాకు లాగా పక్కకు తీసి పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులు గమనిస్తున్నారని సరైన సమయంలో వివేకంతో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు .అనంతరం మన్సూర్ అలీ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రతులను బహిరంగంగా ప్రదర్శించి బిఆర్ఎస్ పార్టీలోజరిగిన పరిణామాలను ఆర్ఎంపి పిఎంపీలకు వివరించారు.నియోజకవర్గంలోని ఆర్ఎంపి పిఎంపీలు ఐకమత్యంతో ఉండి మాయ మాటలు ఎన్నికల హామీలు అస్సలు నమ్మవద్దని తమ న్యాయమైన హక్కులను సాధించుకోవటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని అన్నారు . ప్రతి ఆర్.ఎం.పి పీఎంపీ గ్రామీణ వైద్యులు తమ పరిధిలో ప్రాథమిక వైద్య సేవలు మాత్రమే అందించాలని పరిధికి మించి వైద్యం చేయరాదని అన్నారు ప్రభుత్వం గుర్తించిన గుర్తించకపోయినా ప్రజలు ప్రజా దేవుళ్లే మనల్ని గుర్తిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలాజీ చెస్ట్ హాస్పిటల్, ఖమ్మం డాక్టర్ జి శ్యామ్ కుమార్ అత్యవసర ప్రాణాపాయపరిస్థితుల్లో చేయవలసిన ప్రాథమిక వైద్య చికిత్సల గురించి వివరించినారు .ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీని చింతలపాలెం మండల కమిటీ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు .ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఆర్ఎంపీ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి రవిబాబు మునగాల మఠంపల్లి మండల ఆర్ఎంపీ సంఘం అధ్యక్షులు ఎరుకల శ్రీశైలం ,శంషుద్దీన్ ,చింతలపాలెం ఆర్ఎంపి సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాంబాబు , శ్రీనివాసరావు, హసన్, లింగరాజు , శ్రీను, మంగయ్య ,అబ్దుల్ రహీం, ఏడుకొండలు, జబ్బార్, బ్రహ్మారెడ్డి శ్రీనివాస్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని ఆర్ఎంపి పిఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :