సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్ల మీదకు మార్పు చేయడం రైతుబంధు నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన గత హుజూర్ నగర్ తహసీల్దార్ జయశ్రీని, ధరణి ఆపరేటర్ జగదీష్ లను మంగళవారం సుదీర్ఘంగా విచారించారు. పోలీసులు తహసీల్దార్ జయశ్రీని, ధరణి ఆపరేటర్ జగదీశ్ను మూడు రోజులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజు పంచుల సమక్షంలో సీఐ చరమందరాజు ప్రశ్నించారు. జరిగిన వ్యవహారంలో రికార్డు పరమైన సాక్షా లను సేకరించడంపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. తహసీల్దార్ జయశ్రీ తనకు ఆరోగ్యం బాలేదని కొంత సమయం ఇవ్వాలని మాత్రమే చెబుతున్నట్లు సమాచారం. ఆమె నుంచి సమాచారం రాబట్టడానికి మరింత సమయం పడుతుందని పోలీసులు అంటున్నారు....
-----------------------
Admin